తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులపై వరాలు కురిపించారు. ప్రగతి భవన్‌లో హోంగార్డులతో బుధవారం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోంగార్డుల జీతాలను రూ.12 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. పెంచిన జీతాలను జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్టు తెలిపారు. డైలీ అలవెన్సును రూ. 200 కు పెంచడంతో పాటు.. ఏడాదికి రూ. 1000 చొప్పున జీతం పెంపు ఉంటుందని వెల్లడించారు.