ఇంటింటికీ ఇంటర్నెట్, ఫోన్, టీవీ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.149కే ఏపీ ఫైబర్ నెట్ అంటూ ఊదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ కు సరఫరా చేసేందుకు చైనా నుంచి దిగుమతి చేసిన సెటాప్ బాక్సులను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫైబర్ గ్రిడ్ కు 3.5 లక్షల ఐపిటివి సెటాప్ బాక్సులను సరఫరా చేసే కాంట్రాక్టును టెరా సాఫ్ట్ వేర్స్ పొందింది. ఈ సంస్థ సెటాప్ బాక్సులను చైనా నుంచి తెప్పించింది