ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా భావిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ పథకం ద్వారా ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. అలాగే, పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.2,161 కోట్లు కేటాయించడానికి సమ్మతించింది.