జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ఓ భారీ మొసలి హల్‌చల్ చేసింది. వ్యవసాయపనులకు వెళుతున్న రైతులు మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలివి.. మహాదేవపూర్ మండలం పల్గుల అటవీ ప్రాంతంలోకి ఓ భారీ మొసలి వచ్చింది. మొసలి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా స్థానికులు గుర్తించి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అతి కష్టం మీద మొసలిని బంధించి.. శివ్వారం మొసళ్ళ సంరక్షణ కేంద్రంలో వదిలారు.
హల్‌చల్ చేసిన భారీ మొసలి
Jan 5 2020 7:27 PM | Updated on Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement