సైనిక వైమానిక దళ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ వద్ద రెండు ఐఏఎఫ్ జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. సూర్యకిరణ్ ఏరోబేటిక్స్ బృందం రిహార్సల్స్ నిర్వహిస్తుండగా మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. గాలిలోనే ఈ రెండు జెట్లు కాలి బూడిదైనట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈప్రమాదంలో ఒక పైలట్ దుర్మరణం చెందగా మిలిగిన ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.