బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడంతో బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. వారం రోజుల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టడం ఇది రెండవ సారి కావడం గమనార్హం.