కుటుంబరావు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం | Sakshi
Sakshi News home page

కుటుంబరావు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం

Published Fri, Sep 13 2019 4:33 PM

సాక్షి, విజయవాడ: గత చంద్రబాబు నాయుడుప్రభుత్వం అండదండలతో టీడీపీ నేతల కబ్జాల పర్వం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విజయవాడ మధురానగర్‌లో టీడీపీ నేత, రాష్ట్ర్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కుటుంబం కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన స్థలానికి కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డులను అధికారులు తొలగించారు.

కుటుంబరావు కుటుంబీకుల చేతుల్లో కబ్జాకు గురైన స్థలం గేటుకు జేసీ మాధవీలత నోటీసులు అంటించారు. టీడీపీ హయాంలో కుటుంబరావు కుటుంబీకులు రూ.200 కోట్లకు పైగా విలువ గల ప్రభుత్వ భూమిని చేజిక్కించుకున్నారు. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్‌ చేసి భారీగా లబ్ధి పొందిన విషయం ఇటీవల ‘స్పందన’ కార్యక్రమానికి అందిన ఫిర్యాదుల ద్వారా వెలుగు చూసింది. నీతిమంతుడినని ప్రగల్భాలు పలికిన కుటుంబరావు కబ్జా వెలుగులోకి రావడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement
Advertisement