వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణ పనుల్లో మరోసారి వంచనకు రంగం సిద్ధమైంది! ఈ పనులకు ఇప్పటికే రెండుసార్లు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేసినా ఓ కాంట్రాక్టర్ ఎత్తుగడలతో రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంచనాలు భారీగా పెంచి మూడోసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది.