కశ్మీర్‌ను దేశంలో సంపూర్ణంగా ఐక్యం చేయడం, రక్తపాతం, ఉగ్రవాదానికి తావు లేని ప్రశాంత ప్రాంతంగా చూడటమే తమ లక్ష్యమని, అందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. చర్చ అనంతరం భారీ మెజారిటీతో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. రానున్న ఐదేళ్లలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించిన అనంతరం జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.