ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏ చిన్న కారణంతోనైనా మ్యాచ్ జరగపోతే ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ నాకౌట్ మ్యాచ్‌లంటే మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానంగా వర్షం వెలిసిన తర్వాత అవుట్ ఫీల్డ్‌ను సిద్ధం చేయడంలో క్రికెట్ బోర్డులో సరైన చర్యలు తీసుకోలేకపోతే విమర్శలు వర్షం కురుస్తోంది. ఇలా చేయాలంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.