తెలుగు సినీ పరిశ్రమలో మహిళను ఆటవస్తువుగానే చూస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి.. పరిశ్రమలో తెలుగువారికి న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని అంటున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను దర్శకులు, వారి పిల్లలు, నిర్మాతలు నీచాతి నీచమైన డిమాండ్లతో వేధిస్తారని ఆమె ఆరోపిస్తున్నారు.