ఆత్మహత్యకు పాల్పడిన కమెడియన్ విజయ్ సాయి కేసులో మరో సంచలన అంశం బయటకొచ్చింది. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆయన భార్య వనిత మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను వెల్లడించింది. ఇంకా సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారంటే..