సచిన్‌, ధోనీలను మించిన కోహ్లి.. | Virat Kohli inks Rs 100-crore deal with Puma | Sakshi
Sakshi News home page

Feb 21 2017 6:51 AM | Updated on Mar 21 2024 8:11 PM

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆటతోనే కాకుండా ప్రచారకర్తగా కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్‌ లైఫ్‌ స్టైల్‌ బ్రాండ్‌ పూమాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. దేశంలో ఒకే బ్రాండ్‌తో వంద కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న తొలి క్రీడాకారుడిగా భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డులకెక్కాడు. ఎనిమిది సంవత్సరాలకు రూ.110 కోట్లతో ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కోహ్లి ప్రసిద్ధ క్రీడాకారులు జమైకా పరుగుల వీరులు ఉసెన్‌బోల్ట్‌, అసఫా పోవెల్‌, ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు థీయరీ హెన్రీ, ఆలివర్‌ గిరౌడ్‌ల సరసన చేరాడు. ఒప్పందం ప్రకారం కోహ్లికి పూమా సంవత్సరానికి రూ.12 నుంచి రూ.14 కోట్లు ఇవ్వనుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement