ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం పరాజయమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్ సింగ్ మరో నాకౌట్ విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్లు్యబీవో) ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ పోరులో నేటి (శనివారం) రాత్రి జరిగిన బౌట్ లో భారత బాక్సర్ విజేందర్ సత్తా చాటాడు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్న చెకాతో విజేందర్ పది రౌండ్లపాటు జరగాల్సిన ఫైట్ లో మాజీ ప్రపంచ చాంపియన్ ఫ్రాన్సిస్ చెకా (టాంజానియా)తో మూడో రౌండ్లోనే ప్రత్యర్థి చెకాను నాకౌట్ చేసి టైటిల్ నిలబెట్టుకున్నాడు.