భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం దాదాపు ఖాయమైంది. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరుగురు పోటీపడుతున్న ఈపురస్కారానికి సంబంధించి అవార్డు కమిటీ మంగళవారం తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. ఇటీవల ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు సానియా మీర్జా పేరును కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.