ఫీల్డింగ్‌ చేస్తుండగా..ఆ క్రికెటర్‌ కాలూడిపోయింది! | cricketer loses artificial leg while fielding | Sakshi
Sakshi News home page

Oct 31 2016 6:08 PM | Updated on Mar 22 2024 11:05 AM

దుబాయ్‌లో ఇటీవల ఐసీసీ అకాడెమీ ఇన్విటేషనల్‌ టీ20 టోర్నమెంట్‌ సందర్భంగా అరుదైన ఘటన జరిగింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ దిశగా దూసుకుపోతున్న బంతిని ఇంగ్లండ్‌ క్రికెటర్‌ లియాయ్‌ థామస్‌ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. కాలు ఊడిపోయినా అతను మాత్రం వెనక్కితగ్గలేదు. ఒంటికాలితో కుంటుతూ బంతిని కీపర్‌కు విసిరేసి.. అందరి మన్ననలు అందుకున్నాడు. లియామ్‌ థామస్‌ దివ్యాంగుడు. ఇంగ్లండ్‌ దివ్యాంగుల క్రికెట్‌ టీమ్‌లో సభ్యుడైన అతడు ఇటీవల పాకిస్థాన్‌ దివ్యాంగుల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ విధంగా అసాధారణ ప్రతిభ చూపాడు. బౌండరీ వెళుతున్న బంతిని డైవ్‌ చేసి అడ్డుకోబోతుండగా.. అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. అయినా, ఒంటికాలితో కుంటుతూ వెళ్లి బంతిని అందుకొని.. కీపర్‌కు అందించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement