చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి | China Super Series 2016: PV Sindhu in Semis | Sakshi
Sakshi News home page

Nov 19 2016 7:52 AM | Updated on Mar 21 2024 8:11 PM

కెరీర్‌లో లోటుగా ఉన్న సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మారుు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 22-20, 21-10తో హీ బింగ్‌జియావో (చైనా)పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో నాలుగు టైటిల్స్ (బిట్ బర్గర్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, జపాన్ ఓపెన్, స్విస్ ఓపెన్) సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హీ బింగ్‌జియావో నుంచి సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement