నిరీక్షణ ముగిసింది. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో మైలురాయిని చేరుకుంది. ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా సెరెనా కొత్త చరిత్ర సృష్టించింది. 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును ఈ ‘నల్లకలువ’ బద్దలు కొట్టింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన అక్క వీనస్ విలియమ్స్‌పై సెరెనా గెలుపొంది ఏడోసారి ఈ టైటిల్‌ను సాధించింది. అదే క్రమంలో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.