ఏపీలో ఉన్నది మోసకారి ప్రభుత్వమని, టీడీపీది పూర్తి అసమర్ధ నాయకత్వమని ప్రజలు నిర్ధారణకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన నవ నిర్మాణ దీక్ష ఫార్స్ అని, వారి నిస్సహాయతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. టీడీపీ నేతల ఊకదంపుడు ఉపన్యాసాల కోసం మహిళలను, పిల్లలను మండుటెండలో కూర్చోబెట్టడం దారుణమని పేర్కొన్నారు. పిల్లలను ఎండలో హింసించినందుకు చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టరాదో చెప్పాలని డిమాండ్ చేశారు.