వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి స్పష్టం చేశారు.