వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం వైఎస్ జగన్ బెంగళూరులో బయలుదేరి మధ్యాహ్నానికి పులివెందులకు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలనుంచి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. 18న మంగళవారం ఉదయం 9 గంటలకు సింహాద్రిపురం మండలం బలపనూరుకు చేరుకొని ఇటీవల అనారోగ్యంతో మరణించిన బలపనూరు సర్పంచ్ సరస్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు.