క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకు వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం.. ఇవన్నీ మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశమని ఆయన పేర్కొన్నారు.