ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో విశాఖపట్నం ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. గురువారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లిన వైఎస్ జగన్ను విమానాశ్రయం రన్ వేపైనే పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా వైఎస్ జగన్ రన్ వేపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఆయన వెంట పార్టీ ముఖ‍్యనేతలు ఉన్నారు. విమానాశ్రయంలోనే పోలీసులు వైఎస్ జగన్ను నిర్బంధించారు.