కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలతో కలిసి మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ధర్నా చేపట్టనున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందనందుకు నిరసనగా ఈ ధర్నా చేపడుతున్నారు