రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన ప్రాణం ముఖ్యం కాదంటూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఏడోరోజు కూడా నిమ్స్లో కొనసాగుతోంది. హైడ్రామా మధ్య అర్థరాత్రి ఉస్మానియా ఆసుపత్రి నుంచి వైఎస్ జగన్‌ను నిమ్స్‌కు తీసుకొచ్చాక ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు యత్నించారు. అయితే వైద్యం చేయించుకునేందుకు జగన్ ప్రతిఘటించారు. ఫ్లూయిడ్స్ తీసుకునేందుకు నిరాకరించారు. దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు జగన్‌కు ఈ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన నిమ్స్ వైద్యులు కాసేపట్లో హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. మరోవైపు జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై అభిమానులు, వైఎస్‌ఆర్ నేతల్లో ఆందోళన నెలకొంది. అటు జగన్‌ను చూసేందుకు జననేత కుటుంబీకులను అనుమతించలేదు. దీంతో జగన్‌ను దూరం నుంచే చూసి వైఎస్ విజయమ్మ, భారతి, బ్రదర్ అనిల్ వెనుదిరిగారు.