పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ నేతలు కూడా సంతోషంగా లేరని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయంలో సీక్రెట్ ఓటింగ్ పెడితే మోదీ బండారం బయటపడుతుందని అన్నారు. గురువారం ఆజాద్పూర్లో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.