విశాలాంధ్ర మహాసభ ఏఐసిసి కార్యాలయ ముట్టడి | visalandhra mahasabha activists siege aicc office | Sakshi
Sakshi News home page

Nov 10 2013 4:27 PM | Updated on Mar 20 2024 2:08 PM

విశాలాంధ్ర మహాసభ సభ్యులు, కార్యకర్తలు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పో్లీసులకు మధ్య తోపులాట జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రెండో రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం జంతర్ మంతర్ వద్ద సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్‌, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయి.

Advertisement
 
Advertisement
Advertisement