హైదరాబాద్ యూటీ సాధ్యం కాదు: దిగ్విజయ్ | UT status for hyderabad is not possible says Digvijaya singh | Sakshi
Sakshi News home page

Oct 22 2013 3:37 PM | Updated on Mar 22 2024 11:32 AM

హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం సాధ్యం కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ యూటీ ప్రతిపాదనకు సంబంధించి ఎవరితో మాట్లాడలేదని అన్నారు. రాజ్యాంగం, చట్టప్రకారం తెలంగాణపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చర్చిస్తున్నట్లు దిగ్విజయ్ తెలిపారు. పనిలో పనిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి విశ్వాసపాత్రుడని కితాబిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత జేడీ శీలం...హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement