అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధుకర్‌రెడ్డి అంత్యక్రియల సందర్భంగా మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన అతని భార్య స్వాతిపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. మధుకర్ మృతికి భార్యే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్వాతి తనకు ప్రాణహాని ఉందంటూ తల్లిదండ్రులతో కలిసి భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.