సిరియా వాయుసేన దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. తాజాగా అమెరికాకు చెందిన అలెక్స్ అనే ఆరేళ్ల బాలుడు.. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని అధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశాడు.