భారీ వర్షాలకు పంట నష్టపోవడంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య | Two farmers commit suicide in AP | Sakshi
Sakshi News home page

Oct 27 2013 4:51 PM | Updated on Mar 21 2024 9:01 PM

అకాల వర్షాలు ఇద్దరు రైతుల ఉసురుతీశాయి. భారీ వర్షాలకు పంట నష్టపోవడంతో నిజామాబాద్, నల్గొండ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లిలో రైతు బాగయ్య ఆత్మహత్య చేసుకున్నారు. కోసిన రెండెకరాల వరి తడిసిపోవడంతో మనస్తాపంతో బాలయ్య(48) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా మోత్కుపల్లి మండలం ముసిపట్ల గ్రామంలో రైతు అయినమల్లు ఆత్మహత్య చేసుకున్నారు. పది ఎకరాల పంట వర్షాలకు నష్టపోవడంతో దిక్కుతోచని స్థితిలో అయినమల్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement