శ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు విమానం కోల్‌కతా విమానాశ్రయం వద్ద దాదాపు అరగంట పాటు ల్యాండింగ్ కాకుండా గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది. దాంతో.. తమ దీదీని చంపేందుకు కుట్ర జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా బిహార్‌లో నిర్వహించిన ర్యాలీ అనంతరం రాత్రి 7.35 గంటల సమయంలో మమత అక్కడ విమానం ఎక్కారు. వాస్తవానికి అది 6.35కే రావాల్సి ఉంది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల విమానం అరగంట పాటు గాల్లోనే తిరుగుతూ 9 గంటల సమయంలో ల్యాండయిందని విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఏ విమానాశ్రయంలో అయినా ఇలాంటి ఘటనలు మామూలేనని అన్నారు.