ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి రేపే ఆఖరి రోజని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై లోక్సభలో చర్చ ప్రారంభం కాగానే రాజీనామా చేయాలని సిఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై లోక్సభలో రేపు చర్చ ప్రారంభమవుతుంది. సచివాలయంలోని సిఎం పేషీలో వ్యక్తిగత వస్తువులను సిబ్బంది తీసుకువెళ్లినట్లు సమాచారం. పేషీ అధికారులు కూడా సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. తన రాజీనామాకు సంబంధించి సిఎం ఒకరిద్దరు ఎంపీలకు సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది.
Feb 17 2014 7:52 PM | Updated on Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement