పాకిస్తాన్ కు సుష్మా స్వరాజ్ హెచ్చరిక
కుల్‌భూషణ్ జాధవ్ విషయంలో పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవరిస్తోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపకుండానే పాకిస్తాన్ మిలటరీ కోర్టు అతడికి ఉరిశిక్ష విధించిందని అన్నారు. ఈ అంశంపై రాజ్యసభలో మంగళవారం సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు. కుల్‌భూషణ్ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆధారాలు లేవన్నారు. విచారణ పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి