విపక్షాల ఆందోళనతో తెలంగాణ శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు సభ లోపల బైఠాయించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రభుత్వం తగిన సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు నిరసన కొనసాగిస్తున్నారు.