సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించబోతోంది. లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఏర్పడబోతోంది. సౌర విద్యుత్‌పై రాష్ట్రం అనుసరించే విధానం దేశం మొత్తానికి తలమానికం కాబోతోంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క ఏడాదిలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పి చరిత్ర సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల ప్రకటించిన ‘తెలంగాణ సౌర విద్యుత్ విధానం’ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు మరింత ఊతమిస్తోంది. 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు గత నెలలో టెండర్లు ఆహ్వానిస్తే 6 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెండర్లు దాఖలు అయ్యాయి