విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటును తనకు కేటాయిస్తానని చెప్పిన టీడీపీ అధిష్టానం మాట తప్పిందని రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కన్నబాబు రాజు పేర్కొన్నారు. సోమవారం ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కన్నబాబు మాట్లాడారు.