టీడీపీ దౌర్జన్యకాండ | tdp damnation | Sakshi
Sakshi News home page

Oct 1 2016 7:03 AM | Updated on Mar 22 2024 11:06 AM

టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. చెరుకులపాడు గ్రామంలో శుక్రవారం సాయంత్రం దౌర్జన్యకాండకు దిగారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఒక పొలం విషయంలో టీడీపీ వర్గీయులు, వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు ఉన్నాయి. శుక్రవారం నారాయణరెడ్డి వర్గీయులు ట్రాక్టర్‌లో వెళుతుండగా నలుగురు టీడీపీ కార్యకర్తలు అటకాయించారు. ట్రాక్టర్‌కు ఉన్న రాడ్‌తోనే దాడికి పూనుకున్నారు. హఠాత్పరిమాణానికి హతాశయులైన నారాయణరెడ్డి వర్గీయులు పరుగుతీశారు. గ్రామంలోని నారాయణరెడ్డి ఇంట్లో తలదాచుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇంటి ఆవరణలో ఉన్న జీపును పాక్షికంగా ధ్వంసం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement