హైదరాబాద్ శివారులో ఓ ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. గ్యాస్ లీక్ కావటంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎస్వీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా హయత్‌నగర్ శివారు పెద్ద అంబర్‌పేటకు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఏసీలోని గ్యాస్ లీక్ కావటంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో ఫైర్‌ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలంలోకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. రాజమండ్రిలోని సత్యసాయి ఫోటో ఫ్రేమ్ ఫ్లైవుడ్ దుకాణంలో మంటలు చెలరేగాయి. మొదట అంతస్తులో చెలరేగిన మంటలు ....మూడు అంతస్తులకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సకాలంలో అక్కడి చేరుకున్న ఫైర్‌ఇంజన్ సిబ్బంది మంటలు ఆర్పటంతో మంటలు ఇతర ప్రాంతాలకు అవి వ్యాపించకుండా నిరోధించగలిగారు.
Aug 9 2013 9:26 AM | Updated on Mar 22 2024 10:58 AM
Advertisement
Advertisement
Advertisement
