వినాయక చవితి వస్తోందంటే దేశవ్యాప్తంగా ముందుగానే సందడి మొదలౌతుంది. ముఖ్యంగా ముంబైలో గణేష్ చతుర్థి హంగామా అంతా ఇంతా కాదు. రంగురంగుల విగ్రహాల తయారీతోపాటు ఉత్సవాల్లో సందడి చేసే పాటలకూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ముఖ్యంగా గణపతి బప్పా మోరియా అంటూ వినిపించే గీతాలు.. గణపతి నవరాత్రుల్లో ఎంతో ఆదరణ పొందుతాయి. అయితే ఇంతకు ముందెన్నడూ వినని ప్రత్యేక ట్యూన్స్ తో, ఈసారి భిన్నంగా కంపోజ్ చేసిన 'థాంక్ గాడ్ బప్పా' సాంగ్ లోని ప్రతి చరణం ఆకట్టుకుంటోంది