ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదని వైఎస్సార్ సీపీ కోరుకుంటోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు. శుక్రవారం శాసనసభలో వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్ సీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని నిందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తమ సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.
Sep 4 2015 9:29 AM | Updated on Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement