ఆర్థిక వ్యవస్థ కునారిల్లినప్పుడు, మానవత్వం మరచిన ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నప్పుడు, లాభార్జనే పరమాపేక్షగా పనిచేసే కంపెనీ యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తీసేసినప్పుడు.....కార్మికులు రోడ్డు మీదకు వస్తారు. ఆకలి మంటలతో అలమటిస్తారు. సౌదీ అరేబియాలో భారతీయులకు ఇప్పుడు అదే జరుగుతోంది. గత మూడు రోజులుగా తిండీ తిప్పలులేకుండా అలమటిస్తున్న దాదాపు పదివేల మంది భారతీయ కార్మికులను ఆదుకునేందుకు రియాద్‌లో భారత్ అంబసీ ఆదివారం నాడు జోక్యం చేసుకొంది.