ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం యువభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు. కర్నూలు శివారు గుత్తి జాతీయ రహదారిలోని వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. 10వేల మంది సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ హాలులో ఇందుకోసం సుమారు ప్రత్యేక వేదిక ఇప్పటికే రూపుదిద్దుకుంది.