అవును.. ప్రధాని సావధానంగా విన్నారు | Narendra Modi heard our words on special status, says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

May 15 2017 8:17 PM | Updated on Mar 21 2024 8:18 PM

రైతుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ప్రధానమంత్రిని కలవకపోతే అమెరికా అధ్యక్షుడిని కలుస్తామా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రధానికి రాసిన లేఖకు అప్పుడే అక్కడినుంచి సమాధానం కూడా వచ్చిందని, దాన్ని ఇప్పుడు రాసినట్లుగా ఆంధ్రజ్యోతి ప్రచురించిందని, వాళ్లకు అది ఏ అధికారి నుంచి వచ్చిందో వాళ్లనే అడగాలని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని చాలా సావధానంగా విన్నారని, ఆయన హోదా ఇస్తారనే ఆశ తమకు ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము హోదానే ప్రధాన అంశం చేస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement