వైఎస్ జగన్ బహిరంగ సభకు ప్రజలు వెల్లువెత్తారు. వేలాది మందితో సభ కిటకిటలాడింది. ఈసందర్భంగా నంద్యాల మున్సిపల్ ఛైర్మెన్ సులోచన ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నంద్యాల అభివృద్ధికి చిల్లర కూడా విదల్చలేదని విమర్శించారు. రోడ్ల విస్తరణకు నిధులు కావాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. మున్సిపల్ నిధులతోనే వెడల్పు చేసుకోవాలని సూచించారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు అభివృద్ధి అనే మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. దీంతో విసిగెత్తిన తాము సుమారు రూ.40 కోట్లలతో రోడ్ల విస్తరణ చేపట్టినట్టు ఆమె తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో శిళ్పామోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నంద్యాల ఎన్నికలను శిల్పామోహన్ రెడ్డని గెలిపించి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామన్నారు. వచ్చే ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్ లాంటివన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం అంటూ సులోచన పిలుపునిచ్చారు.
Aug 3 2017 5:55 PM | Updated on Mar 21 2024 10:46 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement