గెలుపే లక్ష్యంగా టీడీపీ బెరితెగిస్తోంది. ఓటుకు నోటు సూత్రాన్ని ఆ పార్టీ పక్కా ఫాలో అవుతోంది. టిడిపి నేత, తాజా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అడ్డంగా దొరికిపోయారు. విజయరామరాజు శ్రీకాకుళం జిల్లాలో స్వయంగా డబ్బు పంపకాలకు దిగారు. పాతపట్నం, ఎల్లంపేట మండలాల్లో ఒక్కొ గ్రామానికి 15 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయల చొప్పున 40 కుటుంబాలకు డబ్బు పంపించానని విజయరామరాజు స్వయంగా చెబుతూ దొరికిపోయారు. అంతేకాదు, డబ్బును అందజేయడంలో అనుచరులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పాతపట్నం శాసనసభ స్థానానికి టిడిపి తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శత్రుచర్ల ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు చూపే వీడియోని కూడా చూడవచ్చు. శత్రుచర్ల నిర్వాకంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయనేతలు చేయాల్సినది ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.