మాండోలిన్ శ్రీనివాస్ కన్నుమూత | mandolin-shrinivas-passes-away-in-chennai | Sakshi
Sakshi News home page

Sep 19 2014 12:15 PM | Updated on Mar 21 2024 8:10 PM

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ (45) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాండోలిన్ శ్రీనివాస్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఆయన 1969 ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపు శ్రీనివాస్ కాగా మాండోలిన్ శ్రీనివాస్గా ప్రసిద్ధి చెందారు. కళారంగంలో సేవలకు గానూ ఆయన రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అందుకున్నారు. చాలా ఏళ్ల క్రితమే మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. కాగా ఆయన అంత్రక్రియలు చెన్నైలోనే జరగనున్నట్లు సమాచారం.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement