బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరం మార్చారు. కమలం పార్టీకి స్నేహహస్తం అందించారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే మద్దతు ఇస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు. అద్వానీని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నట్టు బెంగాల్ టీవీ చానల్ కు వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబెట్టినా మద్దతుయిస్తామని చెప్పారు. జూలై 24న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బీజేపీ అభ్యర్థిగా అద్వానీని నిలబెడతారని ప్రచారం జరుగుతోంది.