ఉత్తరాంధ్రలో హుదూద్ తుఫాన్ బాధితులకు ఆర్ధిక సహాయం అందించడానికి సినీనటులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి పవన్ కళ్యాణ్, రాంచరణ్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, సంపూర్ణేశ్ బాబులు తుఫాన్ బాధితులకు అండగా నిలిచారు. సినీనటులు ప్రకటించిన విరాళాలు: పవన్ కళ్యాణ్ - 50 లక్షలు రాంచరణ్ - 15 లక్షలు మహేశ్ బాబు - 25 లక్షలు జూనియర్ ఎన్టీఆర్ - 20 లక్షలు అల్లు అర్జున్ - 20 లక్షలు సంపూర్ణేశ్ బాబు - 1 లక్ష రూపాయలు+(పాలు, కూరగాయలు, బియ్యం)