గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. చెన్నైలో తాను చికిత్స పొందిన కావేరీ హాస్పిటల్ నుంచి బుధవారం రాత్రి కరుణానిధి డిశ్చార్జ్ అయ్యారు. డీఎంకే చీఫ్ ఆరోగ్యం మెరుగైందని అందుకే ఆయనను డిశ్చార్జ్ కావాలని సూచించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినట్లు వైద్యులు చెప్పారు.